నేటితో ముగియనున్న టెట్ పరీక్షలు…
ఏపీ టెట్ 2024 పరీక్షకు 4,27,300 దరఖాస్తు చేసుకున్నారు. వారిలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు: 4,09,955 మంది ఉన్నారు. మొత్తం 108 పరీక్షా కేంద్రాల్లో టెట్ నిర్వహిస్తారు. ఏపీలోని 22 జిల్లాల్లో 95 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపురం, గంజాంలో ఏర్పాటు చేసిన కేంద్రాలు 13 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేవారు 24,396 మంది ఉన్నారు. డిఎస్సీ పరీక్షల నేపథ్యంలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షలు కఠినంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. డిఎస్సీలో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉండటంతో పలువురు అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే పూర్తైన పరీక్షలకు కీ విడుదల కావడంతో గతంలో వచ్చిన స్కోర్ కంటే తక్కువ మార్కులు వస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.