కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈరోజు అదనపు ఆదాయం. రుణబాధల నుంచి విముక్తి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీపై మరింత ప్రేమ, ఆదరణ చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు సఫలీకృతం అవుతాయి. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. చేజారిన వస్తువులు, డాక్యుమెంట్లు లభిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు. కళాకారులు, రాజకీయవేత్తలు సత్తా చాటుకునే అవకాశం.