దీపావళి నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. బాణాసంచా కాల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయాలైతే, హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఈ ‘ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్’ని ఫోన్‌పే లాంచ్ చేసింది. ఇందులో రూ. 9 కడితే, రూ. 25వేల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..