యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో దేవర(devara)గత నెల సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్వీపాత్రాభినయాన్ని పోషించాడు.ఇక దేవర విడుదలై నేటికీ ఇరవై ఐదు రోజులు. అయినా కూడా అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ ని వసూలు చేస్తూ ఎన్టీఆర్ కి ఉన్న స్టామినాని మరోసారి చాటి చెప్తుంది. ఓవర్ ఆల్ గా ఐదు వందల కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా వసూలు చేసినట్టుగా నిర్మాతలు అధికారంగా  కూడా వెల్లడి  చేసారు.     

రీసెంట్ గా  మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నట్టుగా తెలుస్తుంది.ఒక్క ఏపీ నుంచే వంద కోట్లకి పైగా షేర్ ని రాబట్టిందనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది ఇంతవరకు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 మాత్రమే ఆ ఘనతని సాధించగా ఇప్పుడు  దేవర మూడవ చిత్రంగా నిలిచిందని అంటున్నారు.ఈ రికార్డు మీద  మేకర్స్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందనే వార్తలు  వినిపిస్తున్నాయి. 

ఇక దర్శకుడు కొరటాల శివ(kortala siva)రీసెంట్ గా మాట్లాడుతూ దేవర రెండవ పార్ట్, మొదటి పార్ట్ కంటే వెయ్యి రేట్లు ఎక్కున బాగుంటుందని చెప్పిన నేపథ్యంలో పార్ట్ 2 కోసం అభిమానులందరు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.దేవర సాధించిన విజయంపై ఎన్టీఆర్ కూడా  కొన్ని రోజుల క్రితం చిత్ర బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్  చేసాడు.పార్ట్  1 లో  జాన్వీ కపూర్ హీరోయిన్ గా చెయ్యగా శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలో కనిపించారు.మొదటి పార్ట్ లో నటించిన స్టార్స్ అందరు పార్ట్ 2 లో కూడా కనిపించబోతున్నారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here