విక్టరీ వెంకటేష్(venkatesh)తో సాహసవీరుడు సాగర కన్య, ప్రేమంటే ఇదేరా, పవన్ కళ్యాణ్(pawan kalyan)తో తమ్ముడు, మహేష్ బాబు(mahesh babu)తో యువ రాజు వంటి హిట్ చిత్రాలతో పాటు సుదీర్ఘ కాలం నుంచి  ఎన్నో భారీ సినిమాలని నిర్మించిన నిర్మాత శివరామకృష్ణ.  రాయదుర్గంలో ఉన్న ఎనభై ఎకరాల ప్రభుత్వ భూమి తనదే అంటూ శివరామకృష్ణ నకిలీ పత్రాలపై గతంలో ఒక ల్యాండ్ ని ఆక్రమించాడు.

ఈ మేరకు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ నుంచి పత్రాలు కూడా తెప్పించుకున్నాడు. ఈ విషయంలో శివ రామకృష్ణ(burugupally siva rama krishna)కి  ఆ శాఖ కి చెందిన  సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయం చేసాడు. దీంతో  బిల్డర్‌ మారగొని లింగం గౌడ్‌ తో కలిసి ల్యాండ్‌లో పాగా కూడా వేసాడు.ఈ విషయంపై  2003లో  అప్పటి ప్రభుత్వం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసింది. ల్యాండ్ విషయంలో  శివరామకృష్ణవి సమర్పించినవి నకిలీ పత్రాలని సుప్రీంకోర్టు  తేల్చింది.దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్‌,లింగం గౌడ్‌ను పోలీసులు  అరెస్ట్ చేసారు.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here