కేజీఎఫ్ చాప్టర్ 1, 2 చిత్రాలతో కన్నడ హీరో యశ్.. పాన్ ఇండియా రేంజ్ స్టార్ అయ్యారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ సినిమాలు భారీ బ్లాక్బస్టర్లు అయ్యాయి. కేజీఎఫ్ 2 మూవీ రూ.1,000కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపింది. దీంతో కేజీఎఫ్ 3 ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి విపరీతంగా నెలకొంది. అయితే, యశ్ ప్రస్తుతం రెండు వేరే సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాలతో పాటు కేజీఎఫ్ 3 గురించి కూడా యశ్ మాట్లాడారు.
Home Entertainment Yash: కేజీఎఫ్ 3 పట్టాలెక్కేది ఆ తర్వాతే: కన్నడ స్టార్ యశ్.. రావణుడి పాత్ర చేస్తున్నానని...