తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోజురోజుకీ బలపడుతూ ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని, భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఉగ్రరూపం దాల్చడంతో ఒడిస్సా లోని అనేక ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు చెల్లరేగాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. మూడు లక్షల మందిపై ఒడిస్సాల ప్రభావం ఉందని అధికారులు అంచనా వేశారు.