నందమూరి బాలకృష్ణ(balakrishna)నట వారసుడు మోక్షజ్ఞ(mokshagna)డెబ్యూ మూవీపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.మైథలాజికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ(prashanth varma)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.లెజండ్ ప్రొడక్షన్స్ పతాకంపై బాలకృష్ణ కూతురు తేజశ్వని (tejaswani) మరియు ఎస్ఎల్ వి సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ ని కంప్లీట్ చేసుకుందని, దీంతో డిసెంబర్ 2 న అధికారకంగా ప్రారంభమవ్వడంతో పాటు ఆ రోజునే క్లాప్ కొట్టి, రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుందనే వార్తలు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. బాలకృష్ణ తో బంగారు బుల్లోడు లో కలిసి నటించిన రవీనాటాండన్ కూతురు రషా తథాని హీరోయిన్ గా చెయ్యబోతుందని కూడా అంటున్నారు.షూటింగ్ ప్రారంభం రోజున ఈ విషయంలో క్లారిటీ వస్తుందనే మాటలు కూడా వినపడుతున్నాయి.రానా దగ్గుబాటి ప్రతినాయకుడు పాత్రలో కనిపించడం దాదాపుగా ఒకే అనే టాక్ కూడా వినిపిస్తుంది.

ఇక బాలకృష్ణ కూడా ఒక గెస్ట్ రోల్ చెయ్యబోతున్నాడనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అభిమానులు కూడా అది నిజం అవ్వాలని కోరుకుంటున్నారు. 2025 సెకండ్ ఆఫ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలున్న ఈ మూవీలో హనుమాన్ మూవీని మించిన గ్రాఫిక్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది 

 

  


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here