కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిటీ సివిల్‌ కోర్టులో దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసుపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ తీరును సిటీ సివిల్‌ కోర్టు తప్పు పట్టింది. . ఇంకెప్పుడూ కేటీఆర్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్స్‌ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here