Eluru : ఏలూరు జిల్లాలో ఆయన పరిచయం అక్కర్లేని నేత. 2019 నుంచి 2024 వరకు ఓ వెలుగు వెలిగారు. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ వెంటనే వైసీపీకి రాంరాం చెప్పారు. ఇప్పుడు టీడీపీలో చేరడానికి ట్రై చేస్తున్నారు. అయితే టీడీపీ హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసింది. ఆయన్ను చేర్చుకోవద్దని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.