ఇప్పుడు సినిమాలు రెండు వారాలు ఆడితే గొప్ప అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అలాంటిది డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘దేవర’.. ఐదో వారంలోనూ దూకుడు చూపిస్తోంది. (Devara Collections)

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో కే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇక బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేస్తుందని భావించారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘దేవర’ సంచలనాలు సృష్టించింది. గత నెల రోజుల్లో విడుదలైన సినిమాలన్నీ దేవర ముందు తేలిపోయాయి. ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తెలుగునాట దేవరే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది ప్రేక్షకులకి. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఐదో వారంలోనూ దేవర జోరు కొనసాగుతోంది. శనివారం నాడు వరల్డ్ వైడ్ గా రూ.90 లక్షల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ, ఆదివారం నాడు రూ. కోటి గ్రాస్ రాబట్టే అవకాశముంది. దీపావళి సినిమాలు వచ్చే వరకు ‘దేవర’ జోరు ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉంది. (Devara Box Office)

దేవర ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్లకు పైగా షేర్ (రూ.450 కోట్ల దాకా గ్రాస్) రాబట్టింది. రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఇప్పటికే బయ్యర్లకు రూ.70 కోట్లకు పైగా ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here