అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దు….
మండలంలోని గుడి పేట, నంనూరు, ధర్మారం గ్రామాల శివారులోని అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ధర్మారం ప్రాంతంలో పులి అడుగుల గుర్తులను గుర్తించామని, రోజుకో ప్రాంతానికి సంచరించే అవకాశం ఉన్నందున ముందస్తుగా గ్రామస్థు లను హెచ్చరిస్తూ ప్రజలకు తెలిసేలా గ్రామాల్లో చాటింపు వేయాలని బీట్ అధికారి రాజేందర్ తెలిపారు. గొర్రెలు, పశువుల కాప రులు, ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.