ఈ ఏడాది ఆగస్టులో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు వేణుస్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద…వేణుస్వామి, ఆయన వీడియోలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్లపై విచారణ చేస్తామని తెలిపారు. అనంతరం మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై వేణుస్వామి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఈ స్టే ఆర్డర్ ను ఎత్తివేసింది.