వృశ్చికం
గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబసభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. సమయపాలన అవసరం. శుభవార్త వింటారు. విద్యార్థులకు మంచి సమయం. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. శివారాధన వల్ల శుభఫలితాలు అధికమవుతాయి.