లబ్బర్ పందు
తమిళ స్పోర్ట్స్ డ్రామా మూవీ లబ్బర్ పందు ఓటీటీలోకి ఈ వారమే వచ్చేస్తోంది. అక్టోబర్ 31వ తేదీన డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్కు రానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. హరీశ్ కల్యాణ్, అట్టకత్తి దినేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న థియేటర్లలో రిలీజై బ్లాక్బస్టర్ అయింది. దర్శకుడు తమిళరాసన్ పంచముత్తు ఈ లబ్బర్ పందు మూవీని తెరకెక్కించారు.