కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ని ప్రారంభించి నటుడుగా,నిర్మాతగా,దర్శకుడుగా,సామాజిక సేవకుడిగా తన సత్తా చాటుతూ అశేష ప్రేక్షాభిమానాన్ని పొందిన రియల్ హీరో రాఘవ లారెన్స్(raghava lawrence)ఈ రోజు ఆయన పుట్టిన రోజు.ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు లారెన్స్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.

 

ఈ క్రమంలోనే ఆయన కొత్త చిత్రాలకి  సంబంధించిన టైటిల్స్ ని ఆయా చిత్రాల మేకర్స్ అనౌన్స్ చెయ్యడం జరిగింది. ఒక దానికి ‘కాలభైరవ'(kaala bhairava)అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యగా అందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఒక రేంజ్ లో ఉంది. పాన్ ఇండియా సూపర్ హీరో ఫిలిం అని చెప్పడంతో పాటుగా లారెన్స్ ఒక పవర్ ఫుల్ అవతారంగా రాబోతున్నాడని చెప్పారు. లారెన్స్ కెరియర్ లో ఇరవై ఐదవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి రాక్షసుడు, ఖిలాడీ చిత్రాల ఫేమ్ రమేష్ వర్మ(ramesh varma)దర్శకుడు కాగా ఆ రెండు చిత్రాలని నిర్మించిన కోనేరు సత్యనారాయణ(koneru sathyanarayana)నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 

ఇక మరో మూవీకి ‘బుల్లెట్‌ బండి(bullet bandi)’అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఇందులో ఒక పవర్ ఫుల్  పోలీసు ఆఫీసర్ క్యారక్టర్ లో   లారెన్స్  కనిపించబోతున్నాడని పోస్టర్ ని చూస్తే తెలుస్తుంది. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్  ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పికి చెందిన కతిరేశన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వైశాలి రాజ్, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో చేస్తున్నారు. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here