Crime news: ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఒక లాయరుకు సంబంధించిన కేసుకు సంబంధించి ఒక న్యాయవాది, న్యాయమూర్తి మధ్య ప్రారంభమైన వాగ్వాదం చివరకు తీవ్రస్థాయి ఘర్షణగా మారింది. ఆ కేసు బార్ అసోసియేషన్ సభ్యుడికి సంబంధించినది కావడంతో కోర్టు హాళ్లోకి భారీగా న్యాయవాదులు వచ్చారు. ఘర్షణ పెరగడంతో కోర్టు హాళ్లో న్యాయవాదులు విధ్వంసం సృష్టించారు. అక్కడి కుర్చీలను విసిరి, విరగ్గొట్టారు. ఉద్రిక్తతలు పెరగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వచ్చి లాఠీఛార్జ్ చేశారు. దాంతో, పలువురు న్యాయవాదులకు గాయాలయ్యాయి.
Home International Crime news: కోర్టు హాళ్లో జడ్జీతో లాయర్ గొడవ; న్యాయవాదులపై పోలీసుల లాఠీ చార్జ్-clash breaks...