ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన ఓ పని తెలుగునాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని స్వయంగా వెళ్లి కలిసిన బన్నీ.. ఆయన గెలవాలని ఆకాక్షించారు. ఇది మెగా అభిమానులకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఓ వైపు వైసీపీని గద్దె దించడానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నడుం బిగిస్తే.. ఆ పార్టీ అభ్యర్థి గెలవాలని కోరుకుంటూ నంద్యాల వెళ్లడం ఏంటని మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పటికీ అల్లు అర్జున్ పై మెగా అభిమానులు గుర్రుగానే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఈ వివాదానికి బన్నీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఆహాలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇటీవల నాలుగో సీజన్ ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ కి ఏపీ సీఎం చంద్రబాబు గెస్ట్ గా వచ్చారు. ఈ సీజన్ లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేయనున్నారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ‘పుష్ప-2’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ కూడా సందడి చేయనున్నాడట. రీసెంట్ గా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూట్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా నంద్యాల టూర్ గురించి బన్నీని బాలయ్య సూటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అసలు తాను నంద్యాల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, తన ఉద్దేశమేంటో అల్లు అర్జున్ క్లారిటీ గా చెప్పాడట. ఈ ఎపిసోడ్ రిలీజ్ తర్వాత బన్నీపై మెగా ఫ్యాన్స్ కోపం పూర్తిగా తొలిగిపోతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here