పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా,మంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో చాలా బిజీగా ఉన్నాడు. దీంతో తన అప్ కమింగ్ చిత్రాలకి సంబంధించిన షూటింగ్స్ ని ఏపీ లోనే ప్లాన్ చేసుకున్నాడు. ఈ కోవలోనే హరిహర వీరమల్లు షూటింగ్ విజయవాడ పరిసరాల్లో వేసిన భారీ సెట్స్ మధ్య జరుగుతూ ఉంది. ఇందులో పవన్ తో పాటు చిత్రానికి సంబంధించిన ముఖ్య తారాగణం మొత్తం పాల్గొంటుంది.

ఇక హరిహర వీరమల్లు(hari hara veeramallu)మేకర్స్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ దీపావళి కి వీరమల్లు నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేస్తామని అధికారకంగా చెప్పింది.దీంతో పవన్ అభిమానులు సాంగ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వస్తున్నారు.కానీ ఇప్పుడు దీపావళి కి సాంగ్ రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి సాంగ్ కి సంబంధించిన చాలా పనులు పూర్తి కాలేదని, పవన్ కూడా సాంగ్ రిలీజ్ విషయంలో పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు. 

హరిహర వీరమల్లు ని  శ్రీ సూర్య మూవీస్ పై ఏఎం రత్నం(am rathnam)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. గతంలో ఏఎం రత్నం ,పవన్ కాంబోలో ఖుషి(khushi)బంగారం లాంటి సినిమాలు రాగా ఖుషి అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో వీరమల్లు పై పవన్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుండగా  జ్యోతి కృష్ణ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here