ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు నవంబర్ 7వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. మెరిట్ లిస్ట్ జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభమయ్యే వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నవంబర్ 7 సాయంత్రం 6 గంటలలోపే ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారం వర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో ఉంచినట్లు పేర్కొన్నారు.