Ayodhya Deepotsav: అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన తరువాత జరుగుతున్న తొలి దీపావళి ఇది. ఈ సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సరయూ నది ఒడ్డున, ఆలయ ప్రాంగణంలో, పలు ఇతర ప్రాంతాలలో 25 లక్షల దీపాలను వెలిగించి బాల రాముడి తొలి దీపావళిని ఘనంగా జరిపించారు.