4 రోజుల టూర్ షెడ్యూల్ :
- ఫస్ట్ డే సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
- మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
- మూడో రోజు ఉదయం అల్పహారం చేసిన తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
- నాల్గో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
బుకింగ్ విధానం, ధరల వివరాలు:
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 8000గా ఉంది. చిన్నారులకు రూ. 6400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే పేమెంట్ చేసుకోవచ్చు.