వరంగల్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ సత్యనారాయణకు అరుదైన గుర్తింపు దక్కింది. ఆసిఫాబాద్ సమత కేసు ఛేదించినందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హోమ్ మినిస్టర్స్ అవార్డు వరించింది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈసారి తెలంగాణ నుంచి 26 మందికి దక్కాయి.