డైవ్ చేయని అశ్విన్ సాహసం
వాస్తవానికి గాయాల కారణంగా అశ్విన్ మైదానంలో డైవ్ చేయడానికి సాహసించడు. బ్యాటింగ్ సమయంలో రనౌట్ ప్రమాదం ఎదురైనప్పుడు క్రీజులోకి రావడానికి అతను డైవ్ చేయడం చాలా అరుదు. ఇక ఫీల్డింగ్‌లోనూ అంతే. కానీ.. వాంఖడేలో మాత్రం అశ్విన్ సాహసించాడు. దాంతో మిగిలిన భారత్ ఆటగాళ్ల నుంచి అతనికి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి.
రెండో ఇన్నింగ్స్‌లో ఈరోజు 16 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టగా.. న్యూజిలాండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 168/8తో కొనసాగుతోంది. ఆ జట్టు కేవలం 140 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. భారత్ ముందు 200లోపు లక్ష్యం నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.