బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 30న ప్రారంభం అయ్యింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.bankofbaroda.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ ఫైనాన్స్ మేనేజర్, ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్ మేనేజర్, ఏఐ హెడ్, మార్కెటింగ్ ఆటోమేషన్ హెడ్, టెస్టింగ్ స్పెషలిస్ట్, డేటా ఇంజినీర్, యూఐ,యూఎస్ డిజైనర్, ఎంఎన్సీ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, కార్పొరేట్ బ్యాంకింగ్ ప్రోడక్ట్ మేనేజర్ మొదలైన పోస్టుల కోసం బీవోబీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా తమ సేనలు అందించేందుకు సిద్ధంగా ఉన్న మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా సూచించింది. మొత్తం ఖాళీల్లో ఏపీలో 9 చోట్ల, తెలంగాణలో 7 చోట్ల ఖాళీలు ఉన్నాయి.
Home Andhra Pradesh బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 ఉద్యోగ ఖాళీలు, దరఖాస్తులు ప్రారంభం-నవంబర్ 19 లాస్ట్ డేట్-bank of...