ఢీ షోకి జడ్జిగా శేఖర్ , గణేష్ మాష్టర్స్ తో పాటు హన్సిక కూడా చేస్తోంది. ఐతే ఇప్పుడు హన్సిక కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది. అలాగే ఆది నసగాడు అని కూడా వెగటుగా ముఖం పెట్టి మరీ చెపింది. ఢీ షోలో ఫ్లర్ట్ చేసి ఇరిటేట్ చేసేది ఇంకెవరుంటారు ఆది తప్ప, ఇక శేఖర్ మాష్టర్ మంచి ఎంటర్టైన్ గా ఉంటారు అని చెప్పింది. అలాగే పవన్ కళ్యాణ్ తో మూవీ చేయలేకపోయాను.. అంటూ బాధపడింది. “ఒకవేళ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.
అప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి చేస్తారు” అని అడిగేసరికి “ఇంకెవరికి రవితేజకు ఫోన్ చేస్తా. ఆయన చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. వెంటనే లిఫ్ట్ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చేసి ఆ సమస్య నుంచి ఆ లిఫ్ట్ నుంచి నన్ను బయటపడేస్తారు” అని చెప్పింది. ఢీ షోలో శేఖర్ , గణేష్ మాష్టర్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎవరిది ఎక్కువ ఇష్టమో చెప్పడం కష్టం అని చెప్పింది హన్సిక. అలాగే ఒక్కసారైనా రాజమౌళి సర్ తో పని చేయాలని ఉంది…ఆయన స్టైల్ డిఫెరెంట్ గా ఉంటుంది. ఇక అల్లు అర్జున్, ప్రభాస్, తారక్, రామ్ అందరూ ఇష్టమే. అలాగే అల్లు అర్జున్, హృతిక్ రోషన్ ఇద్దరిలో ఒక్కరితో పని చేయడం కాదు రెండు షిఫ్టుల్లో ఇద్దరితో కలిసి వర్క్ చేస్తాను. ఇద్దరూ చాలా ఇష్టం అని చెప్పింది హన్సిక. ఎందుకంటే హృతిక్ రోషన్ తో కలిసి హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గ “కోయి మిల్ గయా” అనే మూవీలో అద్భుతంగా నటించింది.