రూ.11,826 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు
ప్రజలకు విద్యుత్ భారం పడనుంది. రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కమ్‌లు రూ. 11,826 కోట్ల ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి పంపినట్లు సమాచారం. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఛార్జీల పెంపు ప్రతిపాదనలు డిస్కమ్ లు ఈఆర్సీకి పంపాయి. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 19వ తేదీలోపు లిఖిత పూర్వక అభ్యంతరాలు తెలియజేయాలని ఏపీఈఆర్సీ కోరింది. అయితే 2022-23 సంవత్సరానికి ఇంధన సర్దుబాటు పేరుతో రూ. 6200 కోట్లకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. బాదుడే బాదుడు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలు, విద్యుత్ వినియోగాదారుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.