ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టాన్ని రాజ్యాంగబద్ధమైనదిగా సుప్రీంకోర్టు సమర్థించింది. మదర్సా చట్టం పూర్తిగా రాజ్యాంగం కింద ఉందని నమ్ముతున్నట్టుగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తెలిపింది. దాని గుర్తింపును కాదనలేమని చెబుతూ.. మదర్సాల్లో సరైన సౌకర్యాలు ఉండాలని, విద్యను పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మదర్సా చట్టం రూపొందించిన స్ఫూర్తి, పాలనలో ఎలాంటి లోపం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని రాజ్యాంగ విరుద్ధం అనడం సరికాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని గతంలో హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
Home International Supreme Court : యూపీ మదర్సా చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. కీలక కామెంట్స్.. హైకోర్టు తీర్పు...