చిదానాద ఎస్ నాయక్(chidanada s naik)దర్శకత్వంలో కన్నడ లో వచ్చిన షార్ట్ ఫిలింపేరు సన్ ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ ఒన్స్ టూ నో(sunflowers were the first ones to know)జహంగీర్, విశ్వాస్, వసుధ బరిగత్ లు నటించిన ఈ పదహారు నిమిషాల నిడివి గల షార్ట్  ఫిలిం కన్నడ జానపద కథ ఆధారంగా నిర్మించడం జరిగింది.ఇటీవల జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా అనేక హాలీవుడ్ షార్ట్ ఫిలిమ్స్ తో పోటీ పడి  మొదటి బహుమతి గెలుచుకుంది

ఇప్పుడు 2025 సంవత్సరానికి సంబంధించి లైవ్ యాక్షన్ కాటకేగిరిలో  ప్రతిష్టాత్మక ఆస్కార్(oscar)అవార్డుని అందుకోవడానికి అర్హత సాధించింది. ఈ విషయాన్ని సదరు  షార్ట్ ఫిలిం ని నిర్మించిన ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడి చేసింది.ఒక వృద్ధురాలికి చెందిన కోడి దొంగతనానికి గురవుతుంది.దాంతో కోడిని వెతికే ప్రాసెస్ లో ఆమె పడే తపనని ఇందులో చూపించారు. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here