ఫారం-18 ద్వారా పట్టభద్రుల ఓటర్ల తమ ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేసిన డిగ్రీ సర్టిఫికేట్ నకలు జోడించాలి. అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు కూడా ఫారం-18పై అతికించాలి. దీంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, పదో తరగతి సర్టిఫికేట్, ఓటర్ ఐడీ జిరాక్స్ లను జత చేయాలి. అన్ని కలెక్టరేట్లలో, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తో పాటు సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, ఎంఈవో ఆఫీసులలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
Home Andhra Pradesh పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రేపే లాస్ట్, ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇదే-mlc elections...