(4 / 6)

గత ప్రభుత్వం మాదిరి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, చార్జీలు తగ్గిస్తామని నమ్మ బలికిన చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ ప్రజలను వంచించారని,  వైసీపీ ప్రభుత్వ దారిలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో నడవడం శోచనీయమని సీపీఎం నేతలు ఆరోపించారు.  ఒకవైపున నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు సతమతమవుతుండగా ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం వేయటం గర్హనీయమన్నారు.  ఉచిత సిలిండర్ల పేరుతో 2500 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు, మరోవైపు 17 వేల కోట్ల రూపాయల భారం వేసి ప్రజల జేబులు ఖాళీ చేయటం మోసపూరితమని,   ఈ విద్యుత్ భారాలకు తమకు సంబంధం లేదని విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here