పెళ్లిళ్ల సీజన్ మెుదలైంది. భారతదేశంలో వివాహాలను పెద్ద పండుగలా నిర్వహిస్తారు. పెళ్లి అంటే చాలా ఖర్చు కూడా ఉంటుంది. పెళ్లి వేడుకను నిర్వహించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో బలం చేకూరుతుందని చెప్పవచ్చు. ఇది ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటుంది. ఒక చైన్ సిస్టమ్‌లా పని చేస్తుంది. క్యాటరింగ్ సేవలు, కూరగాయలు, ధాన్యాలు, మాంసం, పాలు, బట్టలు..ఇలా అనేక రకాల పనులు ఇందులో ముడిపడి ఉంటాయి.