హెచ్ఎండీఏ స్వతంత్ర బోర్డు – కేటీఆర్
“నిర్వహణ సంస్థ, హెచ్ఎండీఏ, గ్రీన్కో అనే మూడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్కో అనే సంస్థ మాత్రం తమకు లాభం రాలేదని పక్కకు తప్పుకుంది. వాళ్లకు స్పాన్సర్లు దొరకకపోవటంతో ప్రమోటర్ దొరికే వరకు నేనే భరోసా ఉంటానని చెప్పాను. ప్రభుత్వం తరఫున ఆ డబ్బు ఇద్దామని చెప్పాను. హెచ్ఎండీఏకు తెలియకుండా మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు. కానీ హెచ్ఎండీఏకు పూర్తిగా తెలుసు ఈ-రేస్‌ను మేము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో అరవింద్ కుమార్ గారి తప్పు ఏం లేదు. నేను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటాను. పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖలో ఇంటర్నల్‌గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదు.. హెచ్ఎండీఏ స్వతంత్ర బోర్డు ఈ-రేస్ కారణంగా 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశాం. ఎన్నో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశాం. కూలగొట్టుడు, విధ్వంసం చేయటమే వాళ్లకు తెలిసిన పని. కానీ నిర్మాణం చేయటం వారికి తెలియదు.