టీజర్ ఎలా ఉందంటే?
బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు.. కానీ వాడికి కోపం వస్తే.. వాడంత చెడ్డోడు ఇంకోడు ఉండడు అంటూ రామ్ చరణ్‌ను క్యారెక్టర్‌ను పవర్ ఫుల్ డైలాగ్‌తో టీజర్లో పరిచయం చేశారు. అలానే ఆఖర్లో ఐ యామ్ అన్‌ప్రిడిక్టబుల్ అంటూ టీజర్‌ను క్లోజ్ చేశారు. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య పొలిటీషియన్ రోల్లో కనిపించారు.
రామ్ చరణ్ ఇప్పటి వరకు పొలిటీషియన్‌గా తెరపై కనిపించలేదు. దాంతో ఈ సినిమాపై మెగా అభిమానులు మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుకోగా.. టీజర్లో స్టూడెంట్‌గా, ఆఫీసర్‌గా, పొలిటీషియన్‌గా కూడా పంచెకట్టుతో రామ్ చరణ్ కనిపించారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా.. థమన్ సంగీతం అందించారు.