డంబెల్స్‌తో ఎక్సర్‌సైజ్, ఇంటి ఫుడ్
తాను ప్రతీ రోజు 5 కేజీలు, 10 కేజీల డంబెల్స్‌తో ఇంట్లో సింపుల్ వర్కౌట్స్ చేశానని నవీనా చెప్పారు. బరువు తగ్గడంలో ఈ వ్యాయామాలు చాలా ఉపయోగపడ్డాయని తెలిపారు. “రెండు డంబెల్స్ సాయంతోనే నేను ఇంట్లోనే 20 కేజీల బరువు తగ్గా. కొవిడ్-19 సమయంలో బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో నేను ఇది మొదలుపెట్టా. నాకు స్విగ్వీ, జొమాటో లాంటివి వాడే అలవాటు లేకపోవడం మంచిదైంది. ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తిన్నా. 5 కేజీలు, 10 కేజీల డంబెల్స్‌తో ఇంట్లో ప్రతీ రోజు వర్కౌట్స్ చేశా. నడిచా, డ్యాన్స్ చేశా. బరువు తగ్గేందుకు ఎలాటి మ్యాజిక్ ఫుడ్స్, గంటల పాటు కార్డియోలు చేయాల్సిన అవసరం లేదని తెలుసుకున్నా. సరైన ఫుడ్ తిని.. రోజులో 45 నిమిషాల నుంచి 60 నిమిషాలు వర్కౌట్స్ చేస్తే చాలు” అని నవీనా ఓ వీడియో ద్వారా వెల్లడించారు.