నవంబర్ 14న దేశమంతా పిల్లల పండుగను వేడుకగా నిర్వహించుకుంటారు. పిల్లలు ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచే మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం ఆ రోజే. బాల్యం విలువకు, బాల సంక్షేమానికి విలువ ఇవ్వాలని చెప్పేవారు నెహ్రూ. పిల్లలు అభివృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని పెద్దలే కల్పించాలని వివరించేవారు. ఈ బాలల దినోత్సవం రోజు మీ బంధువులు, స్నేహితులకు చిల్డ్రన్స్ డే విషెస్ ను పంపించేందుకు ఇక్కడ కొన్ని శుభాకాంక్షలు, మెసేజులను తెలుగులోనే అందించాము. వీటిని మెసేజుల రూపంలో, వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియాలో కాపీ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చిల్డ్రన్స్ డే విషెస్ ను ఎంపిక చేసుకుని మీ స్నేహితులకు, బంధువులకు పంపించండి.