ప్రత్యుష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ,కుర్రకారు, అయ్యప్ప దీక్ష,గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి విభిన్న చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు సత్యా రెడ్డి. పైగా ఆయా చిత్రాలన్నింటిని తనే నిర్మించడమే కాకుండా ప్రధాన పాత్రలని కూడా పోషించి నటుడుగా కూడా మంచి గుర్తింపు ని పొందాడు. ప్రస్తుతం ఆయన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాని రూపొందించాడు.
ఈ నెల 29 న ఆ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సత్యారెడ్డి(sathya reddy)మాట్లాడుతు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేఖంగా ఈ సినిమాని రూపొందించాను. వరల్డ్ వైడ్ గా మూడు వందల థియేటర్స్ లో మా సినిమా విడుదల కానుంది.అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నిర్మించాననే ఆరోపణలు రావడంతో పాటుగా గద్దర్ గారు మరణించడం వలన సెన్సార్ లేట్ అయ్యింది. దాంతో రిలీజ్ టైం లేట్ అయ్యింది.మా సినిమా ద్వారా గద్దర్ కు నివాళి ఇస్తున్నాం. స్మగ్లర్ లను హీరోలుగా చూపించే సినిమాల కంటే సమాజానికి మేలు చేసే మా సినిమాని ఆదరించాలని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఈ మాటలు పరోక్షంగా పుష్ప 2(pushpa 2)ని ఉద్దేశించి చేసాడనే విషయం అర్థమవుతుందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. గద్దర్ ఇందులో ఒక కీలక పాత్ర పోషించగా ఆయన నటించిన చివరి సినిమా కూడా ఇదే. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, ప్రైవేటీకరణకి వ్యతిరేఖంగా కూడా పోరాడిన వాళ్ళు ఇందులో నటించారు.