ట్రెక్ మార్గాలు

  • వలమూరు నుంచి అమృత ధార వరకు 8 కి.మీ – జలపాతం వద్దకు 2 కి.మీ ట్రెకింగ్
  • క్రాస్ కంట్రీ ట్రెక్ – టైగర్ క్యాంపు నుంచి విజ్జులూరు వరకు 8 కి.మీ
  • అడ్వెంచర్ ట్రెక్ – వలమూరు నుంచి నెల్లూరు వరకు 10 కి.మీ

మారేడుమిల్లి కార్పొరేట్ ప్యాకేజీలు

  • రాజమండ్రి/కాకినాడ నుంచి 2 రోజుల జంగిల్ స్టార్ నేచర్ క్యాంప్. ఒక్కొక్కరికి రూ.2500. రవాణా, ప్రవేశ టిక్కెట్లు, ఆహారం, డేరా వసతి అందిస్తారు.
  • రాజమండ్రి/కాకినాడ నుంచి 2 రోజుల టూర్ ప్యాకేజీ రవాణా మినహా..ప్రవేశ టిక్కెట్లు, ఆహారం, డేరా స్టే అందిస్తారు. ఒక్కొక్కరికి రూ.1750.
  • 2 డేస్ స్టూడెంట్ ట్రిప్(10వ తరగతి వరకు) రవాణా మినహా ప్రవేశ టికెట్లు, ఆహారం, డేరా స్టే అందిస్తారు. ఒక్కొక్కరికి రూ.1250.

పొల్లూరు జలపాతం

మారేడుమిల్లికి సమీపంలోని మరో పర్యాటక ప్రదేశం మోతుగూడెం పొల్లూరు జలపాతం. ఈ జలపాతం భద్రాచలంలోని లక్కవరం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ జలపాతం వద్ద మూడు దశల్లో ప్రవాహాలు ఉంటాయి. వారాంతాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రదేశానికి చేరుకోవాలంటే పర్యాటకులు తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. భద్రాచలం లేదా మారేడుమిల్లి నుంచి బస్సులో మోతుగూడెం వరకు వెళ్లాలి. చింతూరు నుంచి జలపాతం వరకు ఒక మట్టి రహదారి వెళుతుంది. ఈ ప్రాంతంలో సౌకర్యాలు చాలా పరిమితంగా ఉంటాయి. జలపాతానికి దగ్గరగా ఎటువంటి వసతి ఉండదు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సందర్శకులు పోలీస్ స్టేషన్‌లో తమ వివరాలు అందించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here