కొత్త తరం మారుతీ సుజుకీ డిజైర్ స్టాండర్డ్ భద్రతా ఫీచర్లలో డ్యూయల్ ఫ్రంట్, సైడ్- కర్టెన్ ఎయిర్ బ్యాగులతో సహా ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రేర్ డీఫాగర్, ప్రయాణీకులందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్లు, హై-స్పీడ్ వార్నింగ్ అలర్ట్, రేర్ డీఫాగర్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాకింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్లు వంటి ఇతర ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. కొత్త డిజైర్లో ప్రీ-టెన్షన్, ఫోర్స్ లిమిటర్తో ఫ్రంట్ సీట్ బెల్ట్లు కూడా ఉన్నాయి. అయితే సీట్ బెల్ట్ రిమైండర్ ల్యాంప్, బజర్ కూడా సెడాన్కు ప్రామాణిక ఫీచర్ గా అందుబాటులో ఉన్నాయి.