Betel Leaves in Hinduism: సైంటిఫికల్‌గా, శాస్త్రీయంగా ది బెస్ట్ అనిపించుకున్న మొక్కలలో తమలపాకు టాప్‌లో ఉంటుంది. ఎన్నో ఔషద గుణాలు, ఎన్నో పవిత్రమైన చరిత్ర ఉన్న ఈ ఆకులను పవిత్రమైన ఆచారాలలోనూ వినియోగిస్తుంటారు. హిందూ పురాణాల ప్రకారం చూస్తే, తమలపాకు మహిమాన్వితమైనది, శుభప్రదమైనది, జీవితాల్లోకి శ్రేయస్సును కూడా తెచ్చిపెట్టేది. అసలు తమలపాకు రూపంలోనే ఎన్నో దివ్యమైన శక్తులు కొలువై ఉన్నాయని చెబుతుంటారు. తమలపాకు చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, లోపల విష్ణువు, బయట చంద్రుడు, మూలల్లో శివుడు, బ్రహ్మ ఉంటారని చెబుతారు. తమలపాకు తోక చివర జ్యేష్ఠ భగవతి, కుడివైపు పార్వతి, ఎడమవైపు భూమి, ఇంద్రుడు, ఆదిత్యుడు, పైభాగంలో ఇంద్రుడు, కామదేవుడు ఇలా ఆకులో అన్ని వైపులా దేవుళ్లు కొలువై ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, తమలపాకులు త్రిమూర్తుల చిహ్నం అంతేకాదు లక్ష్మీదేవి చిహ్నం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here