‘గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. శుక్రవారం ప్రజాభవన్‌లో అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాలకు ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి త్వరతిగతిన చర్యలు ప్రారంభించాలని ఆదేశించాను. అందుకు అవసరమైన స్థలాలను సేకరించి స్వయం సహాయక సంఘాలకు లీజుకు ఇవ్వడం, సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులు సమకూర్చాలని బ్యాంకర్లతో సమావేశమయ్యాం. రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here