జెలియో ఎబిక్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కునాల్ ఆర్య మాట్లాడుతూ, “సమర్థవంతమైన, పర్యావరణ అనుకూల పట్టణ రవాణా ప్రయోజనాలను ఎక్కువ మంది వినియోగదారులు గుర్తించడంతో స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ వేగంగా ఆదరణ పొందుతోంది. ఎక్స్-మెన్ 2.0తో పనితీరు, స్థోమతక, సాంకేతికతను సమతుల్యం చేసే ఉత్పత్తిని ఇంజనీరింగ్ చేయడంపై మేము దృష్టి పెట్టాము. మా అధునాతన తయారీ ప్రక్రియలుస, లోతైన పరిశోధన నేటి పట్టణ ప్రయాణికుల అవసరాలను తీర్చే స్కూటర్ని రూపొందించడానికి మాకు వీలు కల్పించింది. స్టైల్, విశ్వసనీయత, ఆకట్టుకునే రేంజ్‌ని ఈ స్కూటర్ అందిస్తుంది. ఎక్స్ మెన్ 2.0 స్లో-స్పీడ్ విభాగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని మేము నమ్ముతున్నాము. ఇది భారతదేశ ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా మారుతోంది,” అని అభిప్రాయపడ్డారు.