తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో చెన్నై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చెన్నైలో నిర్వహించిన ఓ ఆందోళనలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నటి వ్యాఖ్యలపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని పలు పోలీసుస్టేషన్లలో కస్తూరిపై ఫిర్యాదులు చేశారు. చెన్నైలో ఓ తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా… ఆమె పరారయ్యారు. ఆమె ఇల్లు తాళం వేసి ఉండడం, సెల్ ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో… ఆమె కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు… అక్కడికే చేరుకుని ఆమెను అరెస్టు చేశారు.