హిందువుల నమ్మకం ప్రకారం.. వ్యక్తి మరణించిన తర్వాత అస్తికలు బయట ఉన్నంత కాలం ఆ వ్యక్తి ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. అస్తికలు కొన్ని వేల సంవత్సరాలు బయట ఉన్నా అప్పటివరకూ ఆత్మ ఈ లోకంలోని అన్నింటినీ అనుభవిస్తేనే ఉంటారని నమ్ముతారు. అస్తికలు నదిలో కలిపే వరకూ వారి ఆత్మ ఇంటి చుట్టూనే తిరుగుతుందని హిందువులు, పూర్వీకులు నమ్ముతారు.. చనిపోయిన వ్యక్తుల అస్తికలను పవిత్ర గంగలో కలపడం వల్ల వారికి స్వర్గ ప్రాప్తి దొరుకుతుంది. అలాగే స్వర్గ లోకంలో వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయని నమ్ముతారు. ఇందుకు కేవలం గంగ వంటి పవిత్ర నదులను ఎంచుకోవాలి. ముఖ్యంగా హరిద్వార్, ప్రయాగ, గంగాసాగర్ వంటి గంగలు అస్తికలు కలిపేందుకు ప్రసిద్ధి చెందినవి.