స్టేషన్ బెయిల్ కోసం లంచం ఎస్సై, రైటర్ అరెస్ట్
స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్సై, రైటర్ చిక్కిన సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేట పీఎస్ లో చోటుచేసుకుంది. లింగంపేటకు చెందిన జంగంపల్లి శివలింగంగౌడ్… ఒక కేసు విషయంలో స్టేషన్ బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. గత గురువారం బాధితుడు స్టేషన్ రైటర్‌కు డబ్బు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.