ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఇటీవల 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరూ దీనిని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఆదాయం ఉన్నవారు, లేనివారు, ఈ బీమాలో భాగస్వాములు అవ్వొచ్చు. సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడం ఈ పథకం లక్ష్యం. సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ద్వారా లబ్ధి పొందుతారు. లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్ స్కీమ్ కోసం వెబ్‌సైట్ పోర్టల్, ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధార్ కార్డ్, మెుబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఉంటే సరిపోతుంది. సీనియర్ సిటిజన్‌లు అధికారిక నేషనల్ హెల్త్ అథారిటీ వెబ్‌సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here