దిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం, వచ్చే ఏడాది బోర్డు పరీక్షల దృష్ట్యా సోమవారం నుండి 10, 12 తరగతులు మినహా అన్ని తరగతుల విద్యార్థులకు భౌతిక తరగతులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. కాని అదే రోజు సాయంత్రానికి గాలి నాణ్యత మరింత క్షీణించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) ఫేజ్ 4 కింద ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నుంచి జీఆర్ఏపీ 4 అమలుతో 10, 12 తరగతులు మినహా మిగిలిన విద్యార్థులందరికీ భౌతిక తరగతులు మూసివేస్తామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తాయని ముఖ్యమంత్రి అతిషి ఆదివారం తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
Home International 10, 12వ తరగతి విద్యార్థుల ఊపిరితిత్తులు వేరుగా ఉన్నాయా? దిల్లీ గాలి నాణ్యత పిటిషన్లపై విచారణ-is...