తెలుగు చిత్ర సీమలో ఎన్నో హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించి, తన కంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)కూడా ఒకడు. ఆ తర్వాత వివాదాస్పద వ్యాక్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)కి వ్యతిరేకంగా ‘మే’ లో జరిగిన ఎలక్షన్స్ కి ముందు వ్యూహం అనే సినిమాని తెరకెక్కించడమే కాకుండా, ఆ సినిమా రిలీజ్ కి ముందు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు.

దీంతో వర్మ మీద రామలింగయ్య(ramalingaiah)అనే వ్యక్తి  ఏపి లోని  ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో  వర్మ పై ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదయ్యింది.దీంతో  కొన్ని రోజుల క్రితం మద్దిపాడు పోలీసులు వచ్చి వర్మ ని నోటీసులు ఇచ్చి విచారణకి సహకరించాలని కోరారు.ఈ క్రమంలో  వర్మ అరెస్ట్ భయంతో పోలీసుల నుంచి రక్షణ కలిపిస్తు మధ్యంతర ఉత్తుర్వులు జారీ చెయ్యాలంటూ ఏపి  హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసాడు.కానీ ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమంటూ కోర్టు తన తీర్పుని ప్రకటించింది.పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ ని దాఖలు చేసుకోవాలని సలహా  ఇచ్చింది.కాకపోతే విచారణని రెండు వారాలకి వాయిదా వేసింది.

పోలీసులు ముందు హాజరయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలన్న పిటిషన్ ని కూడా తోసిపుచ్చింది.దీంతో ఈ రోజు వర్మ మద్దిపాడు పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నాడు. విచారణలో వర్మ  ఏం మాట్లాతాడనే  ఆసక్తి  అందరిలో  నెలకొని ఉంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here