తమిళ అగ్ర హీరోల్లో ఒకడైన ధనుష్(dhanush)సూపర్ స్టార్ రజనీకాంత్(rajini kanth)కూతురు ఐశ్వర్య(aishwarya)ఇరువురు కూడా తమ భార్య భర్తల బంధానికి స్వస్తి చెప్తున్నామని 2022 లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు కూడా చేసారు.అప్పట్నుంచి ఈ కేసు వాయిదా పడుతూ వస్తుంది.విడాకులు లేట్ అయ్యే కొద్దీ ధనుష్, ఐశ్వర్య కలిసి పోతారనే చర్చ కూడా ఒక దశలో జరిగింది.
ఈ క్రమంలో రీసెంట్ గా ఇద్దరు మళ్ళీ కోర్టు కి హాజరు కావడం జరిగింది. తాము కలిసి ఉండాలని అనుకోవడం లేదని, విడాకులు తీసుకుంటామని ఖరాకండిగా చెప్పడంతో పాటుగా విడిపోవడానికి గల కారణాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇక వాళ్ళు కలడం అనేది జరగని పనని అర్ధమయ్యింది కాకపోతే ఈ నెల ఇరవై ఏడూకి కోర్టు వాయిదా వేసింది
2004 నవంబర్ 18 న ధనుష్, ఐశ్వర్య ల వివాహం జరగగా సంతానంగా ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. ధనుష్ సోదరి, ఐశ్వర్య మంచి స్నేహితురాళ్ళు కావడంతో ధనుష్, ఐశ్వర్య మధ్య పరిచయం పెరిగి ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ధనుష్ కంటే ఐశ్వర్య వయసులో రెండేళ్ల పెద్ద.