గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)రీసెంట్ గా కడప దర్గాలో జరిగిన ఎనభయ్యవ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడనే విషయం తెలిసిందే.అయ్యప్ప మాలలో ఉన్నచరణ్ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(ar rehman)కి ఇచ్చిన మాట ప్రకారం ఆ ఈవెంట్ కి హాజరవ్వడం జరిగింది.ఆ సమయంలో దర్గాలో ఉన్న సమాధికి మొక్కుకొని,మత పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు.కానీ అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ ఒక సమాధి దగ్గరకి ఎలా వెళ్తాడంటూ, అయ్యప్ప భక్తులతో పాటు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ విషయంలో చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం పై చరణ్ వైఫ్ ఉపాసన(upasana)సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ట్వీట్ చేస్తూ ‘దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది. అంతే తప్ప భారతీయులుగా విడిపోయేలా చేయదు.మన బలం ఐక్యమత్యంగా ఉండటం.తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం అంటే సనాతన ధర్మాన్ని పాటించడమే అవుతుందంటూ ట్వీట్ చెయ్యడమే కాకుండా వన్ నేషన్, వన్ స్పిరిట్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా షేర్ చేసింది.
ఒక మహిళా నెటిజన్ కూడా చరణ్ దర్గాకి వెళ్లడంపై నెగిటివ్ గా స్పందించగా’ శబరిమలలో అయ్యప్పని దర్శించుకునే భక్తులు ముందుగా ఎరుమేలి మసీదులో ఉన్న వావర్ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మసీదులో ప్రదక్షిణలు చేసి విభూది తో పాటు ప్రసాదం కూడా తీసుకుంటారు.ఈ సాంప్రదాయం గత ఐదువందల సంవత్సరాల నుంచి వస్తుంది. అక్కడ లేని వివాదం,ఇక్కడ ఎందుకంటు ఉపాసన రిప్లై ఇచ్చింది. తన మతాన్ని అనుసరిస్తూ,ఇతర మతాలను గౌరవించడం అనేది గొప్ప వ్యక్తుల గుణం.చరణ్ సైతం అదే చేసాడనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు.